అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైదరాబాద్లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ దర్శనం కోసం జేసీ పడిగాపులు కాచి అసహనంతో వెళ్లిపో్యారు. మంగళవారం సాయంత్రం జేసీ ఎన్టీయార్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. లోకేష్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. జేసీ గంటసేపు ఎదురు చూసినా లోకేష్ నుంచి పిలుపు రాలేదు. దీంతో అసహనానికి గురైన జేసీ ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ లోగా సర్ రమ్మంటున్నారంటూ లోకేష్ పీఏ.. జేసీకి కబురు చేశారు. అయితే జేసీ.. లోకేష్ను కలవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.