'అమ్మ' అనేది అతిగొప్ప బిరుదని, జయలలిత నిజంగానే లక్షలాది మందిని ప్రేమగా లాలించే అమ్మగా నిలిచిపోయారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆమెను ప్రేమించే వాళ్లందరికీ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.