పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు. అది కూడా జన్ ధన్ ఖాతాలో నుంచి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత జన్ ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ అయిన విషయం తెలిసిందే.