ఓబులేసు రిమాండ్ రిపోర్టు 'సాక్షి' చేతికి చిక్కింది. తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందని, చివరిక్షణాల్లో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నానని.. అందుకే డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని ఓబులేసు అంగీకరించాడు. 12 ఏళ్ల పాటు గ్రేహౌండ్స్లో విధులు నిర్వర్తించానని చెప్పాడు. ప్రముఖులను కిడ్నాప్ చేసి పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలనుకున్నానని, అందుకోసమే ఏకే 47ను చోరీ చేశానని ఓబులేసు పోలీసు విచారణలో అంగీకరించాడు. కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం వచ్చే డబ్బున్నవాళ్లు, పెద్దపెద్ద కార్లలో వచ్చేవాళ్లను గమనించేవాడినన్నాడు. డ్రైవర్ లేని కార్లలో ఓనర్లు ఎక్కిన తర్వాత తాను వెంటనే దూరాలని పథకం వేశానన్నాడు. నిత్యానందరెడ్డి సీటుబెల్టు పెట్టుకుంటున్న సమయంలో తాను సీట్లోకి వెళ్లానని, ఏకే 47తో బెదిరించానని విచారణలో అంగీకరించాడు. అంతకుముందు 2014 ఫిబ్రవరి 19న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడిని అపహరించానని, యువకుడి తల్లిదండ్రుల నుంచి 10 లక్షలు తీసుకున్నానని, తర్వాత అతడిని వదిలేసి నార్సింగిలోని తన ఇంటికి వచ్చానని చెప్పాడు.
Nov 24 2014 9:26 PM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement