డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కేసు తీర్పులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే ఆయనకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్టు తేలింది. రెండు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు ఒక్కో కేసులో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ వెల్లడించారు. ఈ రెండు శిక్షలు దాని తర్వాత ఒకటి అమలు చేస్తారని వెల్లడించారు.