నిర్భయ లాంటి చట్టాలున్నా మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. రాష్ట్ర రాజధాని శివార్లలోని వనస్థలిపురం కుసుమానగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. పార్టీ పేరుతో ఓ యువతిని ఇంటికి పిలిచిన ముగ్గురు యువకులు.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ నెల 15వ తేదీన ఆమెను పార్టీ పేరుతో ఇంటికి పిలిపించుకుని, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆరోజే వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి గాలించి, ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో ఆమెతో వారికి స్నేహం ఉందని, దాన్ని అడ్డుపెట్టుకునే ఆమెను ఇంటికి పిలిపించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆమె బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు మాత్రం ఇంకా పరారీలో ఉన్నారు.