దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీమ్ | Gangster Naeem Shot Dead in Police Encounter at Shadnagar | Sakshi
Sakshi News home page

Aug 8 2016 2:45 PM | Updated on Mar 21 2024 6:45 PM

నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్‌మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఉమ్మడి రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు.

Advertisement
 
Advertisement
Advertisement