చరిత్రలో తొలిసారిగా ఖైరతాబాద్‌ గణపతి..! | ganesh shobha yatra going on in hyderabad | Sakshi
Sakshi News home page

Sep 15 2016 1:57 PM | Updated on Mar 20 2024 3:30 PM

భారీగా వర్షం కురుస్తున్నా.. భాగ్యనగరంలో గణేష్‌ శోభాయత్ర వైభవంగా జరుగుతోంది. ప్రజల ఆటపాటలు, భజన కోలాటాలతో మహా గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు. నగరంలో గణేష్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో సజావుగా ఈ వేడుక కొనసాగుతోంది. హుస్సేన్‌ సాగర్‌కు తరలుతున్న గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఎటుచూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఇక చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా ముందుగానే ఖైరతాబాద్‌ మహగణపతిని నిమజ్జనం పూర్తయింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్‌ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా.. భారీ క్రేన్‌ సాయంతో గణనాథుడిని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించారు. గత ఏడాది వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్‌ మహా గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగియడం విశేషం. ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు ఈసారి ఆరు గంటల్లోనే నిమజ్జనం పూర్తిచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్‌ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement