లాలూ, జగదీశ్ శర్మలపై అనర్హత వేటు | Fodder scam: Lalu Prasad, Jagdish Sharma disqualified from LS | Sakshi
Sakshi News home page

Oct 22 2013 12:16 PM | Updated on Mar 21 2024 6:14 PM

తాజాగా మరో ఇద్దరు లోక్సభ సభ్యులపై అనర్హత వేటు పడింది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్,జేడీయూ ఎంపీ జగదీశ్ శర్మపై వేటు పడింది. దాణా స్కాం కేసులో జైలు శిక్షకు గురైన లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు ఎంపీ జగదీష్ శర్మ కూడా లోక్‌సభ సభ్యత్వాలను కోల్పోయారు. ఈ కేసులో లాలూకు ఆరేళ్లు, జగదీశ్ శర్మకు నాలుగేళ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకు పైగా శిక్ష పడిన ప్రజాప్రతినిధులను తక్షణం అనర్హులను చేస్తూ జూలై 10న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం విదితమే. కాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పదవిని కోల్పోయిన తొలి పార్లమెంటు సభ్యుడు రషీద్‌ మసూదే. దీంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాలు తక్షణమే ఖాళీలుగా ప్రకటించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement