పెద్ద నోట్ల రద్దు దేశంలో ఎంతగా అలజడి సృష్టించినా... ప్రభుత్వ పెద్దలు, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి కేంద్ర మంత్రులు... ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని, దేశహితం కోసం సహనంతో ఉండాలని చెబుతున్నారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందని, నల్లధనాన్ని లెక్కతేల్చి... దేశాభివృద్ధికి వెచ్చిస్తామని నొక్కి చెబుతున్నారు. మరోవైపు సామాన్యుడికేమో ఖర్చులకు నాలుగు కొత్తనోట్లను సంపాదించడానికి సరిపోతోంది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. పైగా బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని నాలుగు వేల నుంచి రెండు వేల రూపాయలకు కుదించారు.