ఫై-లిన్ తుఫాన్ కారణంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని వైయస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి మంగళవారం హైదరాబాద్లో డిమాండ్ చేశారు. ఫై-లిన్ తుఫాన్ తాకిడి వల్ల శ్రీకాకుళం జిల్లాలో అపారమైన పంటనష్టం జరిగిందని తెలిపారు. కనీసం త్రాగునీరు కూడా లభించక జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైలిన్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదీకి వరద పోటెత్తింది. దాంతో నదీలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో గొట్టా బేరీజీలోని అన్ని గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడిచిపెట్టారు. వంశధార నదీ పరివాహక ప్రాంతంమైన ఆముదాలవలస మండలం చెవ్వాకుల పేట గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. దాదాపు డభ్బై కుటుంబాలను రామచంద్రాపురం తరలించారు. స్థానిక పాఠశాలలో వారికి పునరావాసం కల్పించారు.
Oct 15 2013 11:07 AM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement