ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదిగా చలామణి అవుతున్న ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ను పోలీసులు అరెస్టు చేశారు. తోమర్ పత్రాలపై గతంలో అనుమానం వ్యక్తం చేసిన ఢిల్లీ బార్ కౌన్సిల్.. దీనిపై దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687తో పొందినట్లు ఎల్‌ఎల్‌బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ కూడా తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. ఆయన పట్టాల వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయనను మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దీనిపై ఇంకా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందన తెలియాల్సి ఉంది.
Jun 9 2015 1:04 PM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement