తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి తీరుపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. నగర కాంగ్రెస్ ను విభజించి పబ్బం గడుపుకోవడానికి మర్రి చూస్తున్నారని విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడిన దానం.. తనకు చెప్పకుండా హైదరాబాద్ లో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు చెప్పకుండా పార్టీ వ్యవహారాలు నడపడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. నగర అధ్యక్షునిగా తాను పనికి రాను అనుకుంటే మరో నేతను తీసుకునే అధికారం పొన్నాలకు ఉందని.. అయితే మర్రి శశిధర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేయలేదన్నారు. తాను పదవి లేకున్నా.. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికార పార్టీతో, సీఎంతో పైరవీలు తనకు అవసరం లేదని దానం స్పష్టం చేశారు.'మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓ డిజాస్టర్. ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్దనేత అనుకుంటున్నాడు. నాకు చెప్పకుండానే ఇళ్ల నిర్మాణ అంశంపై నగర నేతలతో కలిసి గవర్నర్ కలవడం సరికాదు' అని దానం విమర్శించారు.
Jan 29 2015 4:08 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement