ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయం అనాలోచితమని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. విభజన వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జీఒఎంతో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన అనంతరం వట్టి మీడియాతో మాట్లాడారు. విభజన అంశాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే వచ్చే సమస్యలను పరిష్కరించడం కష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఓఎం పెద్దలకు కూడా ఇవే అంశాలను వివరించినట్లు తెలిపారు. విభజన అంశాన్ని కేంద్రం మరొకసారి పునరాలోచించుకోవాలని సీమాంధ్ర మంత్రులు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే అనంతరం అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను జీఓఎం సభ్యులకు వివరించామని, తమ ప్రాంతానికి తగిన న్యాయం జరుగుతుందని వట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.
Nov 12 2013 7:21 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement