ఇటీవల అనంతపురంలో పరిటాల శ్రీరామ్ పెళ్లి సందర్భంగా జరిగిన రాజకీయ ఘటనలపై, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తులపై వచ్చిన కథనాలపై మంగళవారం వెలగపూడిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకుల ద్వారా టీడీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. అయితే సమావేశంలో చర్చ వేరే విధంగా సాగిందని, బయటకు మాత్రం ఇలా భిన్నమైన లీకులు ఇప్పించారని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో టీఆర్‌ఎస్‌తో పొత్తుల అంశంపైనే సానుకూల చర్చ సాగిందని చెబుతున్నారు. ‘రాజకీయంగానే కాకుండా ఇతర అవసరాల దృష్ట్యా మనం తెలంగాణ రాష్ట్ర సమితితో కలసి వెళ్లాల్సి ఉంటుంది.