పెద్ద నోట్ల రద్దుపై చంద్ర బాబు మాట మార్చారు. నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదని అన్నారు. ‘కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. దీని వలన ఒక కష్టం.. నష్టం కాదు. లెక్క లేనన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. హుద్ హుద్ తుపాను వల్ల విశాఖకు తీవ్ర నష్టం జరిగితే 8 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేశా. ఆగస్టు సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించాను. నోట్ల రద్దు వలన కలుగుతున్న కష్టాలను మాత్రం అధిగమిం చలేకపోతున్నా. రోజుకు రెండు మూడు గం టలు బ్యాంకర్లతో సమీక్షలు జరుపుతున్నా ఉపయోగం ఉండటం లేదు. దీని వలన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది.