ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తిగా ఉచితం కానుంది. ప్రభుత్వ కళాశాలలో చేరే విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజుల పేరుతో ఏటా వసూలు చేస్తున్న (ఒక్కొక్కరి నుంచి రూ. 533 నుంచి 893) కనీస మొత్తాన్ని కూడా తీసుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది.