ప్రకాశం జిల్లాలోని పంగులూరు మండలం జనకవరం సమీపంలోని వాగు నీటిలో బుధవారం ఉదయం పెళ్లి ప్రయాణీకలతో వెళ్లున్న ప్రైవేట్ బస్సు చిక్కుకుంది. అందులో ప్రయాణీలు తమను రక్షించాలంటూ ఆర్తనాదం చేస్తున్నారు. అలాగే అదే జిల్లాలోని కొనకనమిట్ల మండలంలోని ఎదరురాలపాడు సమీపంలోని మూసివాగులో హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అందులోని ప్రయాణీకులకు బస్సుపైకి ఎక్కి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. దాంతో పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. అలాగే కొత్తపల్లి, ఎదురాలపాడు, కొణకనమిట్ల గ్రామాలకు చెందిన యువకులు పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. గురువారం ఉదయం నర్సారావుపేట పట్టణ శివారులోని వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. దాంతో ఆ బస్సుల్లోని ప్రయాణీకులు తమను రక్షించండంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. దాంతో స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి, ప్రయాణీకులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే వాగులోని నీటి ప్రవాహంతో నర్సరావుపేట శివారు ప్రాంతంలోని కాలనీలన్ని జలమయం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో 30 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 50 వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. బాపట్ల, పొన్నూరు, తెనాలి పట్టణాల్లో భారీగా వర్షం కరుస్తుంది. మంగళగిరి వద్ద కొండవీడు వాగు పొంగిప్రవహిస్తుంది. దాంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.