‘దుర్గమ్మ భూములు కూడా వదలడంలేదు’ | buggana rajendranath reddy slams ap government | Sakshi
Sakshi News home page

Oct 31 2016 2:33 PM | Updated on Mar 22 2024 11:05 AM

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి నిర్మాణం అంటూ విదేశీ కంపెనీలకు వేలకోట్లు ఎందుకు కట్టబెడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. సింగపూర్, న్యూయార్క్ వచ్చేస్తోందంటూ పోస్టర్లు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఓ వైపు రైతుల భూములతో పాటు, సదావర్తి సత్రం భూములు తమవారికి కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బెజవాడ దుర్గమ్మ భూములను కూడా వదలటం లేదని బుగ్గన మండిపడ్డారు. దుర్గమ్మ భూములను ప్రయివేట్ విద్యాసంస్థకు కట్టబెట్టేందుకు యత్నిస్తోందని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement