ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే ఇవి కనిపించడంతో ఊపిరి దదపీల్చుకున్నారు. దీంతో తొమ్మిది రోజులపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను ఈవో రమేష్‌బాబు విలేకరులకు చూపించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయాధికారులకు అప్పగించారు.