''ఎగ్జిట్, ఒపినీయన్ పోల్స్ పై నిషేధం'' | Sakshi
Sakshi News home page

''ఎగ్జిట్, ఒపినీయన్ పోల్స్ పై నిషేధం''

Published Mon, May 5 2014 4:47 PM

ఓటర్ స్లిప్ లేకున్నా సరైన గుర్తింపు కార్డ్ ఉంటే చాలు ఓటు వేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎగ్జిట్ , ఓపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాం అని భన్వర్‌లాల్ అన్నారు. స్థానికేతరులు నియోజకవర్గాలు వదిలి వెళ్లాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీలు, వ్యాపారసంస్థలు పోలింగ్ రోజును భత్యంతో కూడిన సెలవుదినాన్ని ప్రకటించాలని విజ్క్షప్తి చేశారు. రాష్ట్రంలోని 2వ దశ పోలింగ్‌లో అరకు, పాడేరు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు...కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెద్దకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్లలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement