ఎయిర్ ఏషియా విమాన ఆచూకీ లభ్యం ! | australian-plane-spots-objects-in-sea-in-airasia-search-area | Sakshi
Sakshi News home page

Dec 29 2014 3:31 PM | Updated on Mar 21 2024 8:52 PM

ఇండోనేసియా సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ కనుగొన్నట్లు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. ఆ విమానానికి సంబంధించిన శకలాలు జావా సముద్రంలో గుర్తించినట్లు తెలిపింది. విమానంలోని మొత్తం 162 మంది మరణించారని పేర్కొంది. 155 మంది ప్రయాణికులతొపాటు ఏడుగురు విమాన సిబ్బందితో ఎయిర్ ఏషియా విమానం - క్యూజెడ్ 8501 ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ కొద్ది సేపటికే ఇండోనేసియా విమానాశ్రయంలోని ఏసీటీ కేంద్రం నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమాన ఆచూకీ కోసం ఇండోనేసియా ప్రభుత్వం గాలింపు చర్యలు తీవ్రతరం చేసింది. అందులోభాగంగా ఎయిర్ ఏషియా విమాన శకలాలు జావా సముద్రంలో ఉన్నట్లు గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు గుర్తించాయని మీడియా తెలిపింది. అయితే విమానం కనుగొన్న విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించవలసి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement