రతన్గఢ్ దుర్గామాత ఆలయం సమీపంలో సింధ్ నదిపై ఉన్న వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 85 మంది మృతి చెందగా, 100 మందిపైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 31 మంది మహిళలు, 17 మంది పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల పరిహారం ఇస్తామని తెలిపింది.