ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో సుమారు 10మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా కథనం ప్రకారం కాబూల్లోని దహ్మజంగ్ సర్కిల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.