వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో నోటిఫికేషన్ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది.