ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది.
Aug 2 2015 7:26 AM | Updated on Mar 22 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement