''స్వలింగ సంపర్కులకు సర్వహక్కులు''

స్వలింగ సంపర్కులు, నపుంసకులు, తృతీయ ప్రకృతికి చెందిన వారిని మిగతా పౌరుల్లాగానే చూడాలని, మిగతావారికి ఉన్న సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి కూడా ఉండాలని సుప్రీం కోర్టు బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. వీరిని తృతీయ ప్రకృతిగా పరిగణించాలని సర్వోచ్చ న్యాయస్థానం పేర్కొంది.

న్యాయమూర్తులు కె ఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయప్రకృతి పట్ల వివక్షను అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడ న్యాయస్థానం ఆదేశించింది.

డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్ పోర్టుల దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుష తో పాటు తృతీయ ప్రకృతి అనే క్యాటగరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్ల ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

లక్ష్మీ త్రిపాఠీ అనే తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. లక్ష్మీ త్రిపాఠీ ఈ తీర్పును చరిత్ర గతిని మార్చేసే తీర్పుగా అభివర్ణించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top