ఈ నెల 7వ తేదీన కాకుండా మరో తేదీన సభ పెట్టుకుంటే టీఎన్జీవోలకు కూడా అనుమతి ఇస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. షరతులకు లోబడే ఈ నెల 7న ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాము చూసుకుంటామని చెప్పారు. 15వేల మందికి మించి ఎల్బి స్టేడియం లోపలికి అనుమతించం అన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు తప్పని సరని చెప్పారు. ఏపీ ఎన్జీవోల సభకు ఆటంకం కలిగిస్తే తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. ఎలాంటి విధ్వంసం జరిగినా ఏపీఎన్జీవోలదే బాధ్యత అని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించాకే ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడకూడదని చెప్పారు.