వినాయక నిమజ్జన ఉత్సవం ఇటీవలనే ముగిసిపోయినప్పటికీ అది చాటి చెప్పిన ఓ మానవీయ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా చక్కెర్లు కొడుతోంది. కాషాల జెండాలు, వస్త్రాలు ధరించిన భక్తులు, భజనపరులు డప్పుల దరువులకు గంతులేస్తుండగా, వారి చుట్టూ వేలాది మంది ప్రజలు ఇసుకకూడా రాలనంతగా కిక్కిర్సిపోయి ఉన్నప్పుడు అటుగుండా ఓ అంబులెన్స్ వచ్చింది.