ప్రహరీ కూలి ఎనిమిది మంది మృతి? | 8 were killed due to Fencing Collapsed | Sakshi
Sakshi News home page

Jul 23 2013 8:01 AM | Updated on Mar 21 2024 6:14 PM

రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజే కాలనీలో ఒక కాంప్లెక్స్ ప్రహరీ సోమవారం అర్ధరాత్రి తరువాత రెండు గంటల సమయంలో కూలిపోయింది. అది పక్కనున్న పూరిల్లుపై పడింది. గోడ శిథిలాలతో అది పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ గుడిసెలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. అందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారంతా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఉప్పల్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి హుటాహుటిన సంఘటనస్థలికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement