రష్యాలో ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిన ఘటనలో 19మంది దుర్మరణం చెందారు. గాయపడిన మరో ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. క్రస్నోయార్క్ రీజియన్ నుంచి ఉరెంగోయ్ వెళుతున్న హెలికాప్టర్ సైబీరియా యమల్ ద్వీపకల్పంలో ల్యాండ్ అవుతుండగా శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.