రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 3,441 పోస్టులతోపాటు జెన్‌కోలో 4,329, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 2,336, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 3,251 పోస్టులు కలిపి మొత్తం 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.