టాలీవుడ్ ప్రేక్షకులకు మహేశ్ బాబు గిఫ్ట్ | mahesh babu tweets about his gift to tollywood viewers | Sakshi
Sakshi News home page

Aug 3 2015 7:35 PM | Updated on Mar 22 2024 10:47 AM

ప్రేక్షకులను ఎంజాయ్ చేయమంటూ మహేశ్ బాబు టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ బహుమతి అందించాడు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న శ్రీమంతుడు సినిమాలో ఓ పాటకు సంబంధించి 40 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ను యూట్యూబ్లో విడుదల చేశాడు. దాని లింకును మహేశ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే.. దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే అంటూ శ్రుతిహాసన్, మహేశ్బాబు మధ్య రొమాంటిక్గా సాగే ఈ పాటకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన యూట్యూబ్ అకౌంటులో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement