యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జై లవ కుశ'. లవ టీజర్ నేడు విడుదల చేసి తన నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ చవితి కానుక అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావటంతో వినాయక చవితి పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం లవ టీజర్ ను రిలీజ్ చేశారు. లవ పాత్రలో ఎన్టీఆర్ చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు.