దేశీయ మూడవ అతిపెద్ద మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా కు రిలయన్స్ జియో ఎఫెక్ట్ భారీగా తాకనుంది. రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సంస్థ పెర్ ఫామెన్స్ వీక్ గా ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా తన వాటాను అమ్మేందుకు యోచిస్తోంది. జియో ఉచిత సేవల కారణంగా మరో మూడేళ్లపాటు ఐడియా పనితీరు మందగించే అవకాశమున్నట్లు మలేసియన్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడియాలో తన 20శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ)విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.