అంతకంతకూ దిగి వస్తున్న బంగారం ధరలు సోమవారం మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 250 క్షీణించి రూ. 27,550 దగ్గర 11నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎనలిస్టులు సూచనలు, నగల దుకాణదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ క్షీణతను నమోదు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.