డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి జీవితం.. ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి జీవితం.. ఆదర్శనీయం

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

పులివెందుల : ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి జీవితం ఆదర్శవంతమైనదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలో డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్‌ కుటుంబ సమాధుల తోటలో ఉన్న డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి ఘాట్‌ వద్ద గంగిరెడ్డి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి, డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి సతీమణి డాక్టర్‌ ఇ.సి.సుగుణమ్మ, కుమారుడు డాక్టర్‌ ఇ.సి.దినేష్‌రెడ్డిలు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భాకరాపురంలో ఉన్న దినేష్‌ నర్సింగ్‌ హోం (గంగిరెడ్డి ఆసుపత్రి)లో వైఎస్‌ భారతీరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ భారతీరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్‌ ఇ.సి.గంగిరెడ్డి పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ, దయతో ఉండేవారన్నారు. ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి ఈ ప్రాంతంలో ప్రాణదాతగా నిలిచారన్నారు. పేదల జీవితాలను మెరుగుపరచాలని ఆయన తపనపడేవారన్నారు. ఆయనను చూసి తాము ఎంతో నేర్చుకోగలిగామని, తమ పిల్లలకు కూడా ఆయన పేదల పట్ల సేవాభావంతో ఉండాలని సూచించేవారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ లక్ష్మీదేవమ్మ, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ ప్రమీలమ్మ,.. వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైఎస్సార్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి, ఇ.సి.గంగిరెడ్డి సోదరి పెద్దక్క, వైఎస్సార్‌ అర్కిటెక్చర్‌ కళాశాల మాజీ రిజిస్ట్రార్‌ సురేంద్రనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు నాగెళ్ల సాంబశివారెడ్డి, లక్ష్మీరెడ్డి, రసూల్‌, సుధీకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా డా.ఇ.సి.గంగిరెడ్డి 6వ వర్ధంతి

నివాళులర్పించిన కుమార్తె

వైఎస్‌ భారతి, సతీమణి సుగుణమ్మ, కుమారుడు దినేష్‌రెడ్డి

దినేష్‌ నర్సింగ్‌ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement