చిన్నారికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి పునర్జన్మ

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

కడప రూరల్‌ : కేవలం 6 నెలలకే 610 గ్రాముల బరువుతో జన్మించిన చిన్నారికి చికిత్స అనంతరం పునర్జన్మ లభించింది. శనివారం స్థానిక కడప నగరంలోని కేఎస్‌హెచ్‌ పురిటి చిన్నపిల్లల ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యులు కే సద్దాం హుస్సేన్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బద్వేలు మండలం మడకవారిపల్లెకు చెందిన గంగులయ్య, విజయ దంపతులకు ఆరు నెలలకే 610 గ్రాములతో మగ శిశువు జన్మించాడని తెలిపారు. జననం నెలలు తక్కువగా, సాధారణ బరువు కంటే అతి తక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం, ఒక రోజు నవజాత శిశువును ఆసుపత్రికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ దశలో అవయవాలు సక్రమంగా ఎదగవు, పనిచేయవన్నారు. శిశువుకు ఆక్సిజన్‌ కుడా సక్రమంగా అందక అనారోగ్యంతో ఉన్నట్లు పరీక్షించి, అడ్వాన్స్‌ వెంటిలేటర్‌ హెచ్‌ఎఫ్‌ఓయూలో ఉంచి 10 రోజులు వైద్య చికిత్సను అందించామన్నారు. మొత్తం 79 రోజుల పాటు అవసరమైన చికిత్సను అందించడంతో, శిశువు 1570 గ్రాముల బరువు కలిగి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం పట్ల దంపతులు విజయ, గంగులయ్య సంతోషం వ్యక్తం చేశారు.

5న పీజీఆర్‌ఎస్‌ రద్దు

కడప సెవెన్‌రోడ్స్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన (సోమవారం) జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

● 6 నెలలకే 610 గ్రాముల బరువుతో జననం

● 79 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement