కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రామగోపాల్ జిల్లాలోని న్యాయమూర్తులతో జిల్లా కోర్ట్ హాల్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్సా మీడియేషన్ 3.0, నవంబర్ 21న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్, డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై చర్చించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్, ఉమ్మడి కడప జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు.
శిక్షణ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్‌గోపాల్ ఆధ్వర్యంలో కడప యూనిట్‌లో న్యాయమూర్తులకు జిల్లా కోర్టు ఆవరణలో ‘కంప్యూటర్ నైపుణ్యాల పెంపుదల స్థాయి 1 స్థాయి 2లపై కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి.సి.ఆసిఫా సుల్తానా, మాస్టర్ ట్రైనర్ అండ్ జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం ఎస్.మధుసూదన్ రావు శిక్షణ ఇచ్చారు.


