ట్యాంకర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ బోల్తా

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

ట్యాంకర్‌ బోల్తా డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు ప్రధాన రహదారిలో స్థానిక శివాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దాల్మియా సిమెంటు కర్మాగారం నుంచి సిమెంటు లోడుతో బెంగళూరుకు ప్రయాణిస్తున్న ట్యాంకరు బైపాస్‌ రహదారిలోని ఓవర్‌ బ్రిడ్జి వద్దకు రాగానే.. అదుపుతప్పి రహదారి పక్కనే వున్న లోతట్టు ప్రాంతంలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాంకరు క్యాబిన్‌ భాగం నుజ్జునుజ్జయింది. ఎత్తయిన ప్రదేశం నుంచి ట్యాంకరు బోల్తా కొట్టినా అదృష్టవశాత్తు అందులోని డ్రైవరుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

● యువకుడి మృతి

జమ్మలమడుగు రూరల్‌ : జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రహదారిలో బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని గురుతేజ(22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీళ్ల ట్యాంక్‌ వీధికి చెందిన గురుతేజ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనులు చేసుకుని జీవించేవాడు. శుక్రవారం సాయంత్రం పట్టణం నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గంమధ్యలోని ముద్దనూరు రహదారిలో డివైడర్‌ను ఢీకొన్నాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement