అన్నదాత ఆశలపై ఎల్‌నినో నీళ్లు చల్లింది. నమ్ముకున్న నైరుతి రుతుపవనాలు నట్టేట ముంచడంతో జిల్లాలో కరువు రాక్షసి కోరలు చాచింది. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా వాన చుక్క రాలకపోవడంతో.. పచ్చని చేలు కాస్తా కళ్లముందే ఎండి బీళ్లుగా మారుతున్నాయి. జరగాల్సిన | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆశలపై ఎల్‌నినో నీళ్లు చల్లింది. నమ్ముకున్న నైరుతి రుతుపవనాలు నట్టేట ముంచడంతో జిల్లాలో కరువు రాక్షసి కోరలు చాచింది. ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా వాన చుక్క రాలకపోవడంతో.. పచ్చని చేలు కాస్తా కళ్లముందే ఎండి బీళ్లుగా మారుతున్నాయి. జరగాల్సిన

Oct 3 2026 1:50 AM | Updated on Oct 3 2026 1:50 AM

● రైతన్న గుండెల్లో ఆందోళన తీవ్రం! ● కరువు జాబితాలో 37 మండలాలు

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో 37 మండలాలను కరువు కింద ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 14 మండలాలు తీవ్ర కరువుగా, 23 మండలాల్లో మోడరేట్‌ కరువుగా ప్రకటించారు. రెవెన్యూ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) శాఖ ఈ మేరకు జీఓ ఎంఎస్‌ నెం. 4 విడుదల చేసింది. జిల్లాలోని మైలవరం, మైదుకూరు, లింగాల, పులివెందుల, తొండూరు, కమలాపురం, వేంపల్లె, చక్రాయపేట, వీరబల్లి, పెద్దముడియం, రాజుపాలెం, జమ్మలమడుగు, వీఎన్‌ పల్లె, సుండుపల్లె మండలాలను తీవ్ర కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించారు. ఇక దువ్వూరు, ముద్దనూరు, బ్రహ్మంగారిమఠం, శ్రీ అవధూత కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, చాపాడు, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, అట్లూరు, ఎర్రగుంట్ల, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, రాజంపేట, కొండాపురం, గోపవరం, ఖాజీపేట, వేముల, కడప మండలాలను మోడరేట్‌ కరువు కింద ప్రకటించారు. జిల్లా మొత్తాన్ని కరువు జాబితా కింద ప్రకటించాలని అధికార యంత్రాంగం రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే సిద్దవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాలను కరువు కింద ప్రభుత్వం గుర్తించలేదు.

కరువు ప్రకటనకు ఇవీ సూచికలు....

కరువు ప్రకటనకు వర్షపాతలోటు, డ్రై స్పెల్స్‌ మాండెటరీ ఇండికేటర్స్‌గా తీసుకున్నారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 689 మిల్లీమీటర్లు. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 377.2 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 205.1 మి.మీ. నమోదైంది. దీంతో –45.6 డీవియేషన్‌ ఏర్పడింది. +19 శాతం నుంచి –19 శాతం డీవియేషన్‌ను సాధారణమైనదిగా పరిగణిస్తారు. –20 శాతం నుంచి –59 శాతం వరకు డెఫిషియంట్‌గా, –60 శాతం నుంచి ఆపైన స్కాంటిగా పరిగణిస్తారు. ఆ విధంగా జూన్‌ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 14 మండలాలు స్కాంటిగా, మిగిలిన 26 మండలాలు డెఫిషియంట్‌గా గుర్తించారు. 20 మండలాల్లో రెండు చొప్పున, మరో 20 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున డ్రై స్పెల్స్‌ నమోదయ్యాయి. ప్రామాణిక వర్షపాత సూచిక (ఎస్‌పీఐ) మరో ప్రధానమైనది. ఒక నిర్దిష్టకాలంలో సంభవించే వర్షపాత కొరతను శాసీ్త్రయంగా అంచనా వేస్తారు. ఎస్‌పీఐ విలువ 1 లేదా అంతకన్న తక్కువ ఉంటే వాతావరణ కరువుగా పరిగణిస్తారు. పై మూడు ఇండికేటర్స్‌ జిల్లాలో నిర్దారణ అయ్యాయి. ఇక ఇంపాక్ట్‌ ఇండికేటర్‌ అయిన పంటల సాగు విసీ్త్రర్ణం, రిమోట్‌ సెన్సింగ్‌, భూమిలో తేమ శాతం, భూగర్బ జలాలు, జలాశయాల్లో నీటిమట్టాలను పరిగణలోకి తీసుకున్నారు. జిల్లాలో ఉన్న గండికోట, మైలవరం, బ్రహ్మంసాగర్‌, సీబీఆర్‌ తదితర 11 ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యం 82 టీఎంసీలకుగాను ప్రస్తుతం 37 టీఎంసీలే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. గత సంవత్సరం ఇదే సమయానికి జిల్లాలో 10.45 మీటర్లలో భూగర్బ జలాలు ఉండేవి. నేడు 13.05కు చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో భూగర్బ జలమట్టం పడిపోతోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని జిల్లా మొత్తాన్ని కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం సిఫార్సు చేసింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన విడుదల చేసింది. బహుశా ఈనెలాఖరులోపు కేంద్ర బృందం కరువు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement