కడప అర్బన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా శుక్రవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జాతిపిత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రాన్ని అందించి చరిత్రలోనే మహోన్నత వ్యక్తిగా, జాతిపితగా నిలిచారని కొనియాడారు.గాంధీజీ ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. .
కలెక్టరేట్‌లో ..
కడప సెవెన్‌రోడ్స్ : కడప కలెక్టరేట్‌లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించకుని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ వేంకటపతి, డీడీ సోషల్ వెల్ఫేర్ చింతామణి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు


