విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని వివిధ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఎంపికై న అభ్యర్థులకు బుధవారం కడపలోని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు ఆదనపు కోర్డినేటర్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్ల ధ్రువీకరణ, తుది మెరిట్‌ జాబితా పరిశీలన అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించి ఆరుగురికి డీఈఓ షంషుద్దీన్‌, సమగ్రశిక్ష ప్రాజెక్టు అదనపు కో ఆర్డినేటర్‌ బి. అనురాధలు నియామక ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికై న అభ్యర్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

లింగాల పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

లింగాల : పోలీసుల ద్వారా తమకు ప్రాణహాని ఉందంటూ లింగాల మండలం లోపట్నూతల గ్రామానికి చెందిన పెద్దపోతల వెంకట సురేష్‌ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డీఐజీ కోయ ప్రవీణ్‌, జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, మానవ హక్కుల సంఘంతో పాటు పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాడు. లింగాల ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డితో పాటు పోలీస్‌ సిబ్బంది తనను స్టేషన్‌కు రావాలంటూ బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. పోలీసులు తనకు చేసిన ఫోన్‌ కాల్స్‌, వాయిస్‌ రికార్డులను ఆయన వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లింగాల ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిని వివరణ కోరగా.. లోపట్నూతల గ్రామానికి చెందిన ఒక రైతు తన కుటుంబంలోని మహిళలను వెంకట సురేష్‌ మానసికంగా వేధిస్తున్నాడని, పొలంలోని గేట్‌ వాల్స్‌ పగులగొట్టాడని ఫిర్యాదు చేశారన్నారు. ఆ కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలవగా, తప్పించుకోవడానికే సురేష్‌ పోలీసులపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని ఎస్‌ఐ అన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలం వై కోడూరులోని వంక సమీపంలో ఉన్న శ్రీ అంజనేయస్వామి గుడి పక్కన ఉన్న సత్రం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి బుధవారం మాట్లాడుతూ మృతుడికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. ఉంగరాల జట్టు, బూడిద రంగు టీ షర్ట్‌, ఎడమ చేతికి ఆర్‌ అనే ఇంగ్లీషు అక్షరం ముద్దర ఉందన్నారు. ఇతిని ఆచూకీ తెలిస్తే 9121100530 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.

మైదుకూరులో వృద్ధుడు..

మైదుకూరు : పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌ లో బుధవారం సాయంత్రం ఓ వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని పలువురు గుర్తించారు. అతిగా మద్యం తాగి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం అందడంతో ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో నివాసం ఉంటున్న వృద్ధుడి కుమార్తె దస్తగిరమ్మ మైదుకూరుకు చేరుకొని మృతి చెందిన వృద్ధుడు తన తండ్రి దస్తగిరి అని పోలీసులకు తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రి మద్యం తాగుతూ.. తిరుగుతూ ఉంటాడని వివరించింది. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement