ఆత్మవిశ్వాసంతోనే విజయం సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసంతోనే విజయం సాధ్యం

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

కడప ఎడ్యుకేషన్‌ : ‘మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎప్పుడూ విజేతలుగా నిలవలేరన్న స్వామి వివేకానందుని మాటలను విద్యార్థులు స్మరించుకోవాలి‘ అని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లా యువజన శాఖ (స్టెప్‌) ఆధ్వర్యంలో బుధవారం వైవీయూలోని అన్నమాచార్య సెనేట్‌ హాల్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026 జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. ఓటములను తట్టుకుని నిలిచిన వారే విజేతలవుతారని, నిరంతరం శ్రమిస్తే వివేకానంద, అబ్దుల్‌ కలాం లాగా మహనీయులవుతారని పేర్కొన్నారు. వైవీయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఏజీ దాము, మాజీ రిజిస్ట్రార్‌ పుత్త పద్మ మాట్లాడుతూ యువత ఆలోచనలను బలంగా మార్చడమే ఈ ఉత్సవాల ఉద్దేశమన్నారు. జిల్లా యువజనశాఖ అధికారి బి.వి. ప్రసాదరావు మాట్లాడుతూ జనవరి 12న వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ ప్రథమ బహుమతి సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు.

మై భారత్‌ యూత్‌ ఆఫీసర్‌ దీపక్‌ జేమ్స్‌ మాట్లాడుతూ యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది మంచి వేదిక అని అన్నారు. కార్యక్రమములో విశ్వవిద్యాలయం ఆచార్య కె. లలిత, ఆచార్య ఎస్‌. సునీత, ఆచార్య సుబాష్‌ చంద్ర, స్టెప్‌, మేనేజర్‌ వి.వి. సుబ్బరాయుడు, సూపరింటెండెంట్‌ రఘుపతి రావు సిబ్బంది అబ్బాస్‌ అలీ, వి.వి. నారాయణ, వై. ఫల్గుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement