పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పట్టపగలే చోరీ

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

● 44 గ్రాముల బంగారు నగలు

● 30 తులాల వెండి అపహరణ

అట్లూరు : పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే తాళాలు పగలగొట్టి 44 గ్రాముల బంగారు నగలు, 30 తులాల వెండిని దొంగలు దోపిడీ చేశారు .ఈ సంఘటన అట్లూరు మండలం కొండూరు బీసీ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. కొండూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బుక్కే అరుణ, అయ్యవారయ్య దంపతులు తమ ఇద్దరి పిల్లలతో మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి సిద్దవటం మండలం మూలపల్లెలో వెలసిన అయ్యవారయ్య స్వామి గుడికి వెళ్లారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరిగి వారు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో వారు ఆందోళనతో లోపలికి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. బీరువాలోని దుస్తులు అన్ని చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. నగలను వెతకగా 25 గ్రాముల బంగారు హారం, 7 గ్రాముల మాటీలు, 10 గ్రాముల రెండు జతల కమ్మలు, మరో రెండు ఉంగరాలు కలిపి 44 గ్రాముల బంగారు, 30 తులాల వెండితోపాటు రూ.4,500 నగదు దొంగలించినట్లు గుర్తించారు. లబోదిబోమంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ గౌడ్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement