వైద్య అధ్యాపకులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

వైద్య అధ్యాపకులకు న్యాయం చేయాలి

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

కడప అర్బన్‌ : ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జీడీఏఏపీ ఆధ్వర్యంలో జీఎంసీ కడప వైద్యులు నెల రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం జీజీహెచ్‌ ఓపీడీ బ్లాక్‌ వద్ద వైద్యులు నిరసన తెలిపారు. ‘వైద్యులకు న్యాయం చేయాలి – పెండింగ్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి‘ అంటూ నినాదాలు చేశారు. 2016 నుంచి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బోధనా వైద్యుల వేతన / పే రివిజన్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు ప్రమోషన్లు, ఎన్పీపీఏ, క్యాడర్‌ సమస్యలు, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే దశలవారీగా ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. రోగుల భద్రత, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కొనసాగిస్తామని జీడీఏఏపీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జీడీఏఏపీ తరపున డాక్టర్‌ ఫరూక్‌, డాక్టర్‌ రాయుడు, డాక్టర్‌ రమణయ్య, డాక్టర్‌ అమానుల్లా, డాక్టర్‌ మధు, డాక్టర్‌ ఛత్రపతి, మహిళా డాక్టర్లు పాల్గొన్నారు.

రిమ్స్‌ ఓపీ వద్ద డాక్టర్ల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement