కడప ఎడ్యుకేషన్ : యువతలో నైపుణ్యాభివృద్ధి, రచనా రంగాన్ని ప్రోత్సహించే దిశగా నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వైవీయూ ప్రొఫెసర్ పి. సరిత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఈఎస్‌ఎన్ పబ్లికేషన్స్(ఇండియా) చైన్నె, లండన్ క్వశ్చన్ ఆఫ్ స్కిల్ డెవెలప్‌మెంట్(ఎల్‌ఓస్‌డి), యూకే వారి ఆధ్వర్యంలో చైన్నెలో నిర్వహించిన కార్యక్రమంలో మోస్ట్ ఆఽథార్స్ సైనింగ్ దేర్ ఓన్ బుక్ సైమల్‌టేనియస్లీ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ సాధించారు. ఈ రికార్డులో భాగంగా 1,572 మంది రచయితలు ఒకే సారి తమ సొంత పుస్తకాలపై సంతకాలు చేయడం విశేష ఘనతగా నిలిచింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈఎస్‌ఎన్ పబ్లికేషన్, ఎల్‌ఓఎస్‌డి వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న ఐఐటీ, చైన్నెలో గిన్నిస్ సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పి. సరితకు జినైనెస్ వరల్డ్ లికార్‌ుడ్సను అధికారిక సర్టిఫికెట్‌తో పాటు ‘‘గినైనెస్ సక్సెస్ మీట్’’ జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా యోగివేమన విశ్వవిద్యాలయం మంంగళవారం వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గంగిరెడ్డి గ, రెక్టార్ ప్రొఫెసర్ దాములు అలాగే బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ప్రొఫెసర్ పి. సరితని అభినందించారు.
వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ ప్రశంసలు


