పెన్షనర్లపై కూటమిది దుర్మార్గ వైఖరి ! | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లపై కూటమిది దుర్మార్గ వైఖరి !

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెన్షనర్ల నినాదాలు

● కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ధర్నాలో పాల్గొన్న పెన్షనర్లు

కడప ఎడ్యుకేషన్‌: పెన్షనర్లకు సంబంధించిన న్యాయమైన సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డిదారిలో చట్టాలు చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌, స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామమూర్తి నాయుడు, నాగముని రెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పెన్షనర్లు తరలివచ్చారు. తమ సమస్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన సమస్యలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పెన్షనర్లు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ నాయకులు శ్రీనివాసులు, పెన్షనర్స్‌ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు , ఎలక్ట్రిసిటీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ మొదలగు సంఘాల నాయకులు ప్రభుదాస్‌, సుధాకర్‌, రఘునాథరెడ్డి,ఎల్‌ ఎన్‌ సుబ్బమ్మలు పెన్షనర్స్‌ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు రామూర్తినాయుడు, నాగమునిరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘ నేతలు దస్తగిరి రెడ్డి, దేవదానం,ఆంజనేయులు,రామసుబ్బారెడ్డి, సుబ్బారాయుడు, కొండారెడ్డి , పెన్షనర్ల సంఘ నాయకులు ఆగేపాటి సుబ్బరాయుడు, అపూర్వసుందరి, పార్వతమ్మ ముఖ్య సలహాదారులు జడపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement