వర్షాభావ స్థితిపై ప్రత్యేక కార్యచరణ | - | Sakshi
Sakshi News home page

వర్షాభావ స్థితిపై ప్రత్యేక కార్యచరణ

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

● ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాల పంపిణీ

● పశువుల రక్షణకు ముందస్తు చర్యలు

● ఇన్‌చార్జి మంత్రి సవిత

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 40 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా పరిగణించాలంటూ జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సమర్పించిందని వెల్లడించారు. జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో 82 టీఎంసీల పూర్తి సామర్థ్యానికిగాను 46 శాతం మాత్రమే నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటి విడుదలను సమన్వయంతో చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. సాగునీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా జిల్లాకు మంజూరైన సబ్సిడీ విత్తనాలను ఆమె రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీధర్‌, జేసీ నిధి మీనా, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి, సుధాకర్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్‌హెచ్‌డీసీ భూముల క్రమబద్ధీకరణ :

అర్హులైన ఎస్సీలు సాగు చేసుకుంటున్న జెడ్‌హెచ్‌డీసీ భూములను క్రమబద్ధీకరిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జిల్లా స్థాయి అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మొదటగా మైదుకూరు నియోజకవర్గంలో 150 మంది లబ్దిదారులకు 150 ఎకరాల హక్కులు కల్పిస్తూ అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో మూడు మండలాలు, నాలుగు గ్రామాలకు సంబంధించి 304 ఎకరాల జెడ్‌హెచ్‌డీసీ భూములు 265 మంది లబ్ధిదారుల వివరాలను కమిటీ పరిశీలించిందన్నారు. ఇందులో ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె, దుంపలగట్టులో 143 ఎకరాలు, వల్లూరు మండలం లేబాకలో 42 ఎకరాలు, పోరుమామిళ్ల మండలం ఎల్లో పల్లెలో 117 ఎకరాలు, మైదుకూరు మండలం నంద్యాలంపేటలో 47 ఎకరాల భూములతోపాటు లబ్ధిదారులను గుర్తించామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement