ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

సుండుపల్లి : మండల పరిధిలోని జీకే రాచపల్లి హాస్టల్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిజ్వాన్‌ (22) సోమవారం చైన్నెలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. రిజ్వాన్‌ ఈనెల 23న బైక్‌లో సుండుపల్లికి వస్తుండగా, జీకే రాచపల్లి హాస్టల్‌ సమీపంలో డీజే వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి, క్షతగాత్రుడిని రాయచోటి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తొలుత తిరుపతికి, అక్కడ రెండు రోజుల చికిత్స అనంతరం వేలూరు మీదుగా చైన్నెలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొని..

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఎదురుగా ఆర్టీసీ బస్సు డీనకోడంతో బైక్‌పై వెళ్తున్న వెంకటరమణ (51) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తీసుకుంటే.. ఎర్రగుంట్ల పట్టణంలోని షాదీఖానా వెనుక ఎర్రబ్బాచేనులో నివాసం ఉన్న వెంకటరమణ బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని మొదటి భార్య లక్ష్మీదేవి ఆనారోగ్యంతో కొన్నేళ్ల కిందట మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు.తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి బైక్‌లో ఇంటికి వెళుతుండగా తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ..

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని స్థానిక చౌడమ్మ వీధిలో ఈశ్వరమ్మ (35) అనే మహిళ సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం సైదాపురం గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రవిశంకర్‌రెడ్డితో పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వారికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఈశ్వరమ్మ ఇంట్లో ఇంట్లో శ్లాబ్‌ కడ్డీకి ఉరి వేసుకుని మృతి చెందింది. ఈశ్వరమ్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుబహాన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న ఇద్దరు అరెస్ట్‌

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆనాబంకు వద్ద ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను వన్‌టౌన్‌ సీఐ కొండారెడ్డి ఎస్‌ఐ మైనుద్ధిన్‌తో కలిసి సోమవారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నక్క శ్రీకాంత్‌, నాగేపల్లి రాజేష్‌లు ఓల్డ్‌ 777 డాట్‌ కాం అనే యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఎస్‌ఐ మైనుద్ధిన్‌ ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 9 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement